ETV Bharat / state

తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో అంగన్వాడీ సిబ్బంది ధర్నా - anganwadi workers protest in u kothapalli

జీవో నెంబరు 7 ప్రకారం అర్హులైన సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలంటూ తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో అంగన్వాడీ సిబ్బంది నిరసనకు దిగారు.

anganwadi staff went on protest and demands to give house for employees in east godavari and chittoor district
అర్హులైన సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంగన్వాడీ సిబ్బంది ధర్నా
author img

By

Published : Jun 23, 2020, 11:11 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో...

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ... యు.కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్​ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అంగన్వాడీ సిబ్బందిగా పనిచేస్తున్న తమలో చాలా మందికి ఇళ్లు లేవని తెలిపారు. ఇళ్ల స్థలాల జాబితాలో తమ పేర్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబరు 7 ప్రకారం అర్హులైన సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.

జీవో నెంబరు 7 ప్రకారం అర్హులైన సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పేదలకు ఇస్తున్నట్లుగానే తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

చిత్తూరు జిల్లాలో...

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని... తంబళ్లపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లతో ఉన్న వినతిపత్రాన్ని తహసీల్దార్​కు అందజేశారు.

ఇదీ చదవండి :

ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అంగన్​వాడీ కార్యకర్తల నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.