తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధురాలు శుక్రవారం హత్యకు గురైంది.రాజమహేంద్రవరం డీఎస్పీ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. జంగా నారాయణమ్మ(70), తూర్పు రైల్వేస్టేషన్ రోడ్డు ఆదర్శనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. భర్త సూర్యనారాయణ 30 ఏళ్ల కిందటే మృతి చెందాడు. ఆమెకు సంతానం లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వెళ్లి చూసేసరికి ఓ కుర్చీలో విగతజీవిగా ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిలోని బీరువా తెరచి ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో చోరీకి వచ్చి ఆమెను హతమార్చి ఉండవచ్చనని సీఐ లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: పక్కా వ్యూహంతోనే శిరోముండనం బాధితుడు ప్రసాద్ అదృశ్యం