Ambedkar District: కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని చేస్తూ గోదావరి జిల్లా అమలాపురంలో లాంగ్ మార్చ్‌ను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబేడ్కర్ అభిమానులు ,జిల్లా మద్దతుదారులు లాంగ్ మార్చ్ చేసుకుంటూ అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. తర్వాత అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'మహిళల అక్రమ రవాణాలో ఏపీది రెండవ స్థానం'