మంత్రి పదవి ఇస్తారన్న ఆశతోనే వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపుల్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని మాజీ హోం శాఖ మంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప అభిప్రాయపడ్డారు. కాపుల్ని అవమానించేలా మాట్లాడిన వ్యాఖ్యల్ని కాపు నేతలు గమనించాలని కాకినాడలో పేర్కొన్నారు.
'కాపుల నిధులను వైకాపా దారి మళ్లిస్తోంది'
తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్ సహా వివిధ రకాల లబ్ధి చేకూర్చితే.. వైకాపా హయాంలో కాపులకు సంబంధించిన నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు. విదేశీ విద్య, రుణ సౌకర్యాలు సహా తెదేపా సర్కార్ చేసిన ప్రయోజనాలు ఆగిపోయాయని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడేమో కేవలం 10 వేల ఉద్యోగాలతోనే క్యాలెండర్ విడుదల చేయడం దారుణమన్నారు.
ఇవీ చూడండి : Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత.. కానీ ఆ విషయం మరువొద్దట!