అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ర్యాలీ నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల మనోభావాలు గౌరవించాలని నినాదాలు చేశారు. నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.
కాపవరంలో..
రాజనగరం నియోజకవర్గంలోని కాపవరం గ్రామం నుంచి కోరుకొండ బస్టాండ్ వరకు అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా.. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ రోజు సాయంత్రం అమరావతికి సంఘీభావంగా లాంతర్లు వెలిగిస్తామని తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
ముమ్మిడివరంలో..
ముమ్మిడివరంలో తెదేపా నేతలు, కార్యకర్తలు అమరావతి పోరాటానికి మద్దతుగా నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ నినాదాలు చేశారు.