అమరావతి ఉద్యమం కేవలం కొన్ని గ్రామాలకు సంబంధించింది మాత్రమే కాదని... రాష్ట్ర భవిష్యత్ దీంతో ముడిపడి ఉందని పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి అన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలన్న డిమాండ్‌తో జిల్లాల్లో ఐకాసలను ఏర్పాటు చేయడంలో భాగంగా రాజమహేంద్రవరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనేక ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంఘాల నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. అమరావతిపై అనేక విధాలుగా దుష్ప్రచారం చేశారని ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు అన్నారు.. పరిరక్షణ సమితిలో అనేక మంది వివిధ జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: 'భారత్ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నాం'