సముద్ర జలాల్లో చేపల వేటకు నిషేధం ముగిసినా.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తీరప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. నియోజకవర్గంలోని భైరవపాలెం, బలుసితిప్పకు చెందిన ఒక్క మెకనైజ్డ్ బోటు కూడా సముద్రంలోకి వెళ్లలేదు. నిషేధిత గడువు ముగిసే సమయానికి తుపాను ప్రభావం ఉండటం, అది ఏ దిక్కుకు పయనిస్తుందో ఖచ్చితమైన సమాచారం మత్స్యకారులకు తెలియకపోవటంతో వేచి చూస్తున్నారు.
సముద్ర గాలుల ప్రభావానికి గోదావరి జలాల్లోనూ అలలు ఎక్కువగా వస్తుండటంతో ఇంజిన్ నావలు, తెప్పలపై వేట సాగించేవారు భయపడుతున్నారు. దీంతో బోట్లు అన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. మత్స్యకారులంతా తమ వలలు సిద్ధం చేసుకుని వేటకు వెళ్లేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: నదీ తీరప్రాంతాల్లో నీట మునిగిన భూములపై 'కమిటీ'