తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతున్న పుష్ప సినిమా షూటింగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్గా నటిస్తున్న పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా మారేడుమిల్లి మండలం చావిడి కోట పంచాయతీ ఉప్పరి గోతుల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.
రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రెండు యాక్షన్ ఘట్టాల్ని, ఓ పాటని తెరకెక్కించారు. మరికొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉండగా ప్యాకప్ చెప్పేసి చిత్రబృందం హైదరాబాద్కు తిరిగి వెళ్లింది. కరోనా భయాలతోనే తాత్కాలికంగా చిత్రీకరణ నిలిపివేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి : 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' నటుడిపై కేసు నమోదు