తూర్పుగోదావరి పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ... చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నెల 23న వివిధ గ్రామాలకు చెందిన 145 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయని అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మంగాదేవి తెలిపారు. ఇందులో 138 మందికి నెగెటివ్ రాగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఆమె వెల్లడించారు. ఈ మండలంలో ఇప్పటికే 42 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. వీరిలో కొందరు చికిత్స పొందుతున్నారు.
ఇది చదవండి తూర్పు గోదావరి జిల్లాలో వైరస్ ఉద్ధృతి.. ఒక్క రోజులోనే 117 కేసులు!