పేకాడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శివ ప్రసాద్ తెలిపారు. ఆలమూరు మండలం చొప్పెల్ల శివారు ప్రాంతాల్లో డిసెంబర్ 17, 2020 రోజున పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 48,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా.. ఒక్కొక్కరికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి అమరరంగేశ్వర రావు తీర్పునిచ్చినట్లు ఎస్సై శివ ప్రసాద్ అన్నారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది