తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టులో ఓ సివిల్ కేసుకు సంబంధించిన దావాలో సివిల్ జడ్జి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వరరావు తెలుగులో తీర్పును వెలువరించారు. కపిలేశ్వరపురం మండలం టేకికి గ్రామంలో రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో కొందరు వ్యక్తులు బస్ స్టేషన్, మరుగుదొడ్లు నిర్మించారని 2015లో దావా దాఖలు చేశారు.
ఈ కేసును విచారణ చేసిన అనంతరం సరైన సాక్షాధారాలు లేని కారణంగా కొట్టేస్తూ తీర్పునిచ్చారు. తెలుగులో తీర్పును ఇవ్వడం వల్ల కోర్టులో ఇరు పక్షాలకు అన్ని అంశాలు అర్థమవుతాయని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో తీర్పు చెప్పడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని అన్నారు.
ఇదీ చదవండి:
గిరిజనులకు పోడు పట్టాలివ్వాలని అటవీశాఖాధికారికి ఎమ్మెల్యే వినతిపత్రం