ETV Bharat / state

అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనం పునః ప్రారంభం - ainvalli ganesh temple latest news

నాలుగు నెలల అనంతరం తిరిగి అయినవిల్లిలో సిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆలయ ఈవో తెలిపారు. శనివారం స్వామి వారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.

aienavalli sidhi vinayaka darshan stated for devotees at east godavari district
అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనానికి క్యూలైన్​లో వేచి ఉన్న భక్తులు
author img

By

Published : Aug 8, 2020, 3:31 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలో ప్రముఖ పుణ్యక్షేతమైన సిద్ధి వినాయకుని ఆలయంలో స్వామి వారి దర్శనం పునః ప్రారంభమైంది. కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా నాలుగు నెలల నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. తిరిగి శనివారం ఉదయం నుంచి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూస్తున్నామని ఆలయ ఈవో పి. తారకేశ్వర రావు వెల్లడించారు. పరిమిత సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి :

శనివారం నుంచి తెరుచుకోనున్న అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.