తాటి ఉత్పత్తుల తయారీకి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ పెంచుతున్న తాటి చెట్లను పరిశీలించారు.
తాటి ఉత్పత్తుల కేంద్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నీరా(కల్లు)తో బెల్లం, శీతలపానీయం, తేగలతో బేకరీ ఐటమ్స్ తయారీని పరిశీలించారు. తాటి పండు గుజ్జుతో తాండ్రను, జ్యూస్‌ను తయారు చేస్తున్నారని చెప్పారు. పోషక విలువలు కలిగిన తాటి ఉత్పత్తుల వాడకం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. తాటి ఉత్పత్తులపై ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్త డా.వెంగయ్య ఎంవీఎస్ నాగిరెడ్డికి వివరించారు.
ఇదీ చదవండి: నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన