తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ కొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఓ కుటుంబం ద్వి చక్ర వాహనంపై లోవ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ద్వి చక్ర వాహనం ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి చూడండి...