తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం అనిశా డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన సోదాల్లో సంబంధిత రికార్డులను పరిశీలించారు.
వివిధ గ్రామాల్లో సిబ్బంది పర్యటించి వ్యవసాయ, గృహాలకు విద్యుత్ మీటర్లు తీసుకున్న వినియోగదారుల వివరాలు నమోదు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది ఎవరైనా డబ్బులు తీసుకున్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ రామచంద్ర రావు వెల్లడించారు.
ఇదీచూడండి: ఆలమూరు విద్యుత్ ఉపకేంద్రంలో అనిశా తనిఖీలు