తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్ 2 గంటలుగా నిలిచిపోయింది. ఓ యువకుడు రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి బోగీ స్ప్రింగ్‌లో ఇరుక్కుపోయాడు. రైల్వే సిబ్బంది సుమారు 2 గంటల నుంచి శ్రమించి యువకుడిని బయటకు తీశారు. 3వ నెంబర్ ప్లాట్ ఫారంపై ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఆత్రేయపురం మండలం కొత్తoగి గ్రామానికి చెందిన బీరా కిషోర్ గా గుర్తించారు.
ఇదీ చూడండి: కదిలే రైలు నుంచి దిగబోయాడు.. అంతలోనే!