రౌతులపూడి గ్రామానికి చెందిన కొందరు గౌరీ పట్నంలోని గౌరీ మాత ఆలయ దర్శనం కోసం ఆటోలో బయలు దేరారు. కొద్ది నిమిషాల్లోనే ఆ మాతను చూడబోతున్నామని అందరూ సంతోషించారు. ఇంతలోనే అనుకోని ప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. మృత దేహాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దైవ దర్శనానికి వెళుతూ... అనంత లోకాలకు - pitapuram
గౌరీ మాతను దర్శించుకునేందుకు వెళుతుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడం వల్ల ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.