ETV Bharat / state

'ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయ్.. రీ పోలింగ్ నిర్వహించాల్సిందే'

author img

By

Published : Feb 10, 2021, 4:15 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరులో జరిగిన ఎన్నికలను రద్దు చేయాలంటూ.. ఓ వర్గ ప్రజలు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్​లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల అధికారులను అడ్డుకున్నారు. రీ పోలింగ్​ కు పట్టుబట్టారు.

election counting
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆందోళన

ప్రత్తిపాడు మండలం పోతులూరులో జరిగిన మెుదటిదశ ఎన్నికల్లో కుంచె నూకరాజు అనే అభ్యర్థి... మూడు ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఓడిపోయిన బొండి రాంబాబు అనే అభ్యర్థి... రీకౌంటింగ్​ జరపాలని కోరాడు. ఈ రీకౌంటింగ్​లో బొండి రాంబాబు 2ఓట్ల తేడాతో గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. వెంటనే.. నూకరాజు వర్గం అభ్యంతరం తెలిపింది. 5 ఓట్ల తేడా ఎందుకు వచ్చిందని అడగటంతో.. మూడోసారి కౌంటింగ్ ప్రారంభించారు. ఈసారి 6 ఓట్లు తేడాతో బొండి రాంబాబునే గెలుపొందినట్లుగా అధికారులు మళ్లీ ప్రకటించారు.

ఈ పరిణామంతో.. కుంచె నూకరాజు వర్గీయులు రోడ్డు పై నిరసన తెలిపారు. రీ పోలింగ్​ నిర్వహించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇళ్లకు వెళ్తున్న ఎన్నికల అధికారులను నిలువరించే ప్రయత్నం చేయటంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకొని అధికారులను సురక్షితంగా తరలించారు. భయాందోళనల మధ్య ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:

ఎన్నికల ఫలితాల దృష్ట్యా పలు చోట్ల ఉద్రిక్తతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.