తూర్పు గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన మరీదు సుబ్బారావు (38).. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సీహెచ్ పోతేపల్లికి చెందిన నాగేశ్వరరావు నిమ్మ తోటకు తడి పెట్టేందుకు సోమవారం ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో సుబ్బారావు నీటి బోదెలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తోటకు తడి పెట్టలేదని యజమాని కుమారుడు వెతుక్కుంటూ వెళ్లి చూసేసరికి సుబ్బారావు పంట బోదెలో విగత జీవిగా పడి ఉన్నాడు. ఎస్సై దుర్గ మహేశ్వర రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇదీ చదవంటి :