లాక్డౌన్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మాట వినకుండా రోడ్లపైకి వస్తున్న వారికి లాఠీదెబ్బ రుచి చూపిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్ల పూడి గ్రామస్తులు.. తమ ఊరిలోకి ఎవరూ రాకుండా కంచె వేశారు. అక్కడే పోలీస్ సైరన్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వారి గ్రామానికి వారే కాపలా కాస్తున్నారు.
ఇదీ చూడండి: