తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. చిలకలపాడు ఎన్టీఆర్ కాలనీలోని పంచాయతీ స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు అధికారులు గత కొన్ని రోజులుగా ప్రతిపాదనలు చేస్తుండడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. పనులు చేపట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని తప్పుబట్టారు.
ఆ ప్రాంతంలో బహిరంగ మరుగుదొడ్లను గతంలోనే నిర్మించారని... వాటిని కూల్చి ఆర్బీకే భవనం నిర్మాణం చేయటం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఈ ఘటనపై పంచాయతీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సుమారు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.
ఇవీ చదవండి: