అర్ధరాత్రి సమయంలో కారు, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు దుర్మరణం చెందగా... మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేములవాడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కరప నుంచి వస్తున్న కారు వేములవాడ వద్ద అదుపుతప్పి చెట్టుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో వేములవాడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల భగవాన్, 13 ఏళ్ల సాయి అక్కడిక్కడే మృతి చెందగా...సురేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో వెంకటసాయిరామ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఇదీ చదవండి: