తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తాడితోట అంబేడ్కర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకుని చనిపోయిన మహిళ, ఆమె తల్లి. సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్ (9), రితిక (7) మృతులు. శివపావని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే మనస్తాపంతో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శివపావని భర్త నాగేంద్రకుమార్‌ది విజయవాడగా గుర్తించారు.
ఇదీ చదవండి:
భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు