ETV Bharat / state

నాలుగు పందెం ఎద్దులు మృతి... ఎలా చనిపోయాయి? - తూర్పు గోదావరిలో ఎద్దులు మృతి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో సుమారు 35 లక్షలు విలువ చేసే నాలుగు పందెం ఎడ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. పశువైద్యాధికారి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఎద్దులకు పోస్టు మార్టం నిర్వహించారు.

రూ.35 లక్షల విలువ చేసే నాలుగు పందెం ఎద్దులు మృతి

author img

By

Published : Jan 30, 2021, 3:06 PM IST

సామర్లకోటకు చెందిన రైతు వల్లూరి సత్యేంద్ర కుమార్​కు​ చెందిన 4 ఎద్దులు శుక్రవారం కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీ తర్వాత.. ఎద్దులను సామర్లకోట తీసుకువచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మకాంలో కట్టేసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున వచ్చి చూసేసరికి నాలుగు ఎద్దులకు నురగ వచ్చి.. చనిపోయి ఉన్నాయి. రైతు ఫిర్యాదు మేరకు సామర్లకోట ఎస్​ఐ సుమంత్, పశువైద్యాధికారి మనోజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పశువైద్యాధికారి ఎద్దులకు పోస్టుమార్టం నిర్వహించారు. తెదేపా నేత చినరాజప్ప బాధిత రైతును పరామర్శించారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.