తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద ఆగివున్న లారీలో 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ నుంచి గంజాయి వాసన వస్తుందన్న సమాచారం మేరకు ప్రత్తిపాడు తహసీల్దారు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వంతాడ ఆండ్రూ మినరల్స్ నుంచి మైనింగ్‌ను తరలిస్తున్న ఈ లారీలో 110 ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు నాలుగున్నర లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. త్వరలో సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై రవికుమార్, ఎమ్మార్వో నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :