కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నూట అరవై ఏళ్ళ క్రితం ఫ్రెంచి వారు రోమన్ క్యాథలిక్ చర్చి నిర్మించారు. తుపాన్లు, భారీ వర్షాల కారణంగా చర్చి శిథిలావస్థకు చేరింది. పుదుచ్చేరి ప్రభుత్వం టెంపుల్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా కోటి రూపాయలతో మరమ్మతులు చేపట్టి.. ఆ ప్రార్థనా మందిరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకు వచ్చింది. ఈ చర్చిలో ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సంఘటన సంబంధించి చెక్కతో తయారు చేసిన రూపాలు నేటికీ చెక్కు చెదరలేదు. దీనిని విశాఖపట్నంకు చెందిన బిషప్ ప్రకాష్‌తో కలిసి పుదుచ్చేరి పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ ప్రార్థన మందిరానికి కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఏటా అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చి సందర్శిస్తుంటారు.
ఇదీ చదవండి: