జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థికపరమైన చేయుత చేకూరుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ మూడు కేటగిరీల నుంచి నియోజకవర్గంలో 1420 మంది లబ్ధిదారులను గుర్తించామని అన్నారు. పి గన్నవరం మండలంలో 432, అంబాజీపేట మండలంలో 301, అయినవిల్లి మండలంలో 292, మామిడికుదురు మండలంలో 355 మంది, మొత్తం 1420 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రతి ఏడాది పదివేల రూపాయల ఆర్థిక సహాయం వైకాపా ప్రభుత్వం అందిస్తుందని ఆయన వెల్లడించారు.
ఇది చదవండి విధ్వంసానికి ఒక్క ఛాన్స్.. జగన్ ఏడాది పాలన పై పుస్తకం