చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పందేరుపల్లె వడ్డూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు ఈనెల 1వ తేదీన అదృశ్యమయ్యాడు. తన కొడుకు కనిపించడంలేదని అతని తల్లి 8వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లపై అనుమానమున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఫిర్యాదు రాయడంలో తప్పు దొర్లింది. ఫలితంగా.. 'ఇద్దరు యువతులతో యువకుడు పరారీ' అనే విషయం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై... నేడు పలమనేరు సీఐ శ్రీధర్ వివరణ ఇచ్చారు. యువకుడు వెళ్లింది ఇద్దరు యువతులతో కాదనీ.. ఒక్కరితోనే అని స్పష్టంచేశారు. వీరి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి