చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల పరిధిలోని బడికాయలపల్లెకు చెందిన కుమార్... రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వైకాపా సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పలువురు దాతలు... బాధితుడికి సహాయం అందిస్తున్నారు. సోషల్ మీడియా సభ్యులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి బాధితునికి అందించడంతో పాటు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చేర్పించారు.
తంబళ్లపల్లి మండలం కన్నేమాడుగుకు చెందిన దాతలు దేవర్ ఇంటి రామకృష్ణారెడ్డి, రవి శంకర్ రెడ్డి, ములకలచెరువు మండలం దాసరిపల్లె కు చెందిన జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డిలు వైదేహి ఆసుపత్రిలోని బాధితునికి రూ .41,000 లు విరాళంగా అందజేశారు.
ఇదీ చదవండి