చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం అర్థరాత్రి వైకాపా నేతలు హడావుడి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైకాపా అభ్యర్థి నారాయణ స్వామి... కార్వేటి నగరంలో పర్యటించారు. ముస్లిం కాలనీలో వేర్వేరు పార్టీలకు సంబంధించిన మండల స్థాయి నేతలను కలిసి..వారందరినీ వైకాపాలోకి చేరాలని మంతనాలు జరిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పెద్ద మొత్తంలో వైకాపా నేతలు పార్టీ కండువాలు ధరించి ముస్లిం కాలనీలో అర్థరాత్రి సమయంలో నానా హడావిడీ చేశారు. ఆఖరికి కొంత మంది నాయకులు.. నారాయణ స్వామి సమక్షంలో కండువాలు కప్పుకుని వైకాపాలో చేరారు. ముస్లిం కాలనీ, పాత సంత వీధిలో నారాయణ స్వామి... ఆయన అనుచరులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ దాదాపు గంట సేపు హడావిడి చేసినా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం అటు వైపు దృష్టి సారించలేకపోయారు.