తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతీకార్యకర్త కృషి చేయాలని... శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ పథకాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లాలని సూచించారు.
గురుమూర్తి గెలిస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. తాను గెలిస్తే... తిరుపతి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తానని గురుమూర్తి పేర్కొన్నారు. తనపై నమ్మకంతో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశం ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనను మంచి మెజార్టీతో గెలిపించాలని వైకాపా కార్యకర్తలను కోరారు.
ఇదీ చదవండి: