ETV Bharat / state

YCP: ‘నాయకుల మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి.. నాలా తన్నులు తినకండి’ - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మీయ సత్కారం సభలో కార్యకర్తకు తలకు గాయం

‘నాయకుల మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి. నాలా తన్నులు తినకండి’ అని వైకాపా కార్యకర్త మహబూబ్‌ బాషా (అమ్ముకుట్టి)(ycp activist ammukutty) ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఆత్మీయ సత్కారం సందర్భంగా సభావేదికపైకి వెళ్లిన తనను స్థానిక సీఐ గంగిరెడ్డి అడ్డుకొని తోసేశాడంతో గాయపడిన తనను ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.

ycp activist ammukutty emotional comments
వైకాపా కార్యకర్త మహబూబ్‌ బాషా
author img

By

Published : Nov 8, 2021, 8:13 AM IST

‘నాయకుల మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి. నాలా తన్నులు తినకండి’ అని వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తంచేశారు(ycp activist ammukutty emotional comments on leaders ). చిత్తూరు జిల్లా పుంగనూరు బీఎంఎస్‌ క్లబ్‌ ఆవరణలో శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సభావేదికపైకి వెళ్లిన తనను స్థానిక సీఐ గంగిరెడ్డి అడ్డుకొని తోసేశాడని.. ఈ క్రమంలో పక్కనే ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహంపై పడటంతో తలకు గాయమైందని పట్టణానికి చెందిన వైకాపా కార్యకర్త మహబూబ్‌ బాషా (అమ్ముకుట్టి)(ycp activist ammukutty) తెలిపారు. గాయపడిన తనను ఎవరూ పట్టించుకోలేదని, ఆస్పత్రికి వెళ్లినా తగిన వైద్యసేవలు అందించలేదని పేర్కొన్నారు.

బలిజల సమావేశమైనా అభిమానంతో వెళ్లానని, వేదిక ఎక్కిన తనను రాకూడదని సీఐ అనడం బాధాకరమన్నారు. సీఐ గంగిరెడ్డిని వివరణ కోరగా సభావేదికపై ఎక్కువ మంది ఉండడంతో కిందకు దిగాలని చెబుతూ.. వస్తుండగా కార్యకర్తలు, నాయకులు దిగుతూ రద్దీలో అతను విగ్రహంపై పడ్డాడని తెలిపారు. మంత్రి వెనుక ఎవ్వరూ ఉండవద్దని చెప్పానే గాని మతాల పేరు ఎత్తలేదన్నారు.

ఇదీ చదవండి..

చిక్కిపోతున్న సున్నా వడ్డీ పంట రుణాల పథకం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.