ప్రతి ఒక్క మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా మహిళా చట్టాలపై ఉద్యోగులకు అవగాహన సదస్సు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్ర పాల్గొని.. మహిళల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేదాలను రచించిన వారిలో మహిళలు ఉన్నారనీ.. మహిళలు సంకల్ప బలాన్ని కలిగి ఉండాలన్నారు.
ఇదీ చదవండి: డిక్లరేషన్‌పై చర్చ అనవసరం: నారాయణస్వామి