Women worry at ration card in AP: బియ్యం తీసుకోవడానికి వెళ్లిన ఓ వృద్ధురాలు షాక్కు గురైంది. నువ్వు చనిపోయావు.. బియ్యం ఇవ్వడానికి కుదరదని స్టోర్ అతను చెప్పాడు. ఊపిరితో ఉన్న నేను చనిపోయాననే మాటను ఎట్టా సెప్తారు. ఇదేమీ బాలేదు.. ఎందుకిలా అయిందని చిత్తూరు కలెక్టర్ సార్‌కు మొర పెట్టుకోవాలని కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చానని కన్నీటిపర్యంతమయ్యారు చిత్తూరు మండలం పి.కొత్తూరు గ్రామానికి చెందిన జయమ్మ. వయస్సు 64 సంవత్సరాలు. 2810362496 సంఖ్యతో ఆమెకు బియ్యం కార్డు ఉంది. మూడు నెలల క్రితం నుంచి చౌకదుకాణంలో నిత్యావసరాలు ఇవ్వడం లేదని ఆమె వాపోయారు.
సచివాలయంలో అడిగితే తాను చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోందని చెప్పారు. తనను తిరిగి బతికించాలని అధికారులకు విన్నవించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం నాటి స్పందన కార్యక్రమానికి వచ్చారు. గుండె సమస్య, బీపీ, రక్తపోటుతో బాధపడుతున్నా. ఇప్పుడొచ్చే పింఛను డబ్బుతో వైద్య ఖర్చులు, తన అవసరాలు తీర్చుకుంటున్నా. మానసికంగా ఎంతో సతమతమవుతున్నా. చనిపోయాననే కారణంతో పింఛను రద్దవుతుందని అంటున్నారు. అధికారులు సమస్య పరిష్కరిచాలని అర్థిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు జయమ్మ.
ఇవీ చదవండి: