చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ప్యార్నగర్లో కిరణ్మయి అనే వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటిపైన రేకులపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇది గమనించని మహిళ.. బయటకు వెళ్లగా తీగలు తగిలి విద్యుత్ షాక్తో అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతురాలు మదనపల్లెలోని స్థానిక ఛానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేసేవారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..