చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఏఎం పురానికి చెందిన వెంకటేశ్ భార్య అరుణకుమారికి పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది అరుణకుమారిని అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహిళ కుటుంబసభ్యులు, 108 సిబ్బంది ప్రసవానికి సహకరించారు. అనంతరం తల్లీబిడ్డను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి మదనపల్లిలో ధోని జన్మదిన వేడుకలు