తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి...