తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు.. పరివాహక ప్రాంతాల్లో నుంచి వచ్చిన వరద నీటితో చిత్తూరులోని ఎన్టీఆర్ జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంతాల నుంచి వర్షపు నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు గేట్ల ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి నీరు దిగువకు ప్రవేశించడంతో.. ప్రాజెక్టు వద్దకు సందర్శకుల తాకిడి మొదలైంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి నీరు రానప్పటికీ.. కేవలం పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి నీరు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీరు చేరడంతో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: