ETV Bharat / state

తిరుమల శుద్ధి జలం... అందిస్తోంది పచ్చదనం...

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం తితిదే అన్నిరకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా నీటి సమస్య తగ్గించేందుకు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. భక్తులు రోజుకు 30 గ్యాలన్ల నీరు వినియోగిస్తుండగా... అందులో 80 శాతం పునర్వినియోగంలోకి తెస్తున్నారు.

water-recycling-in-tirumal
author img

By

Published : Nov 21, 2019, 8:59 AM IST

తిరుమల శుద్ధి జలం... అందిస్తోంది పచ్చదనం...

వివిద ట్రస్టుల ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తితిదే...నీటి సంరక్షణలోనూ ముందుంది. శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి నిత్యం వేల మంది వస్తుంటారు. కొండపై నీటి వనరులూ అంతంత మాత్రమే ఉన్నా నీటి సమస్య రాకుండా శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేస్తోంది తితిదే.

కొండపై భక్తులు వినియోగించిన నీటిని శుద్ది చేసేందుకు ఇప్పటి వరకు 4 కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలుత 1994లో 3ఎంఎల్‌డీ సామర్థ్యం గల శుద్ది కేంద్రాన్ని నిర్మించింది. వీటి ద్వారా శుభ్రపరిచిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు.

అన్నమయ్యభవన్‌కు సమీపంలో నూతనంగా నీటి శుద్ధి కేంద్రాన్నినిర్మించగా...మరో కేంద్రం ఏర్పాటుకు చర్యలు ప్రారంబించారు. ఇప్పటి వరకు మొక్కల పెంపకానికే వినియోగిస్తుండగా... తాజాగా మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక పైపు లైన్లు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి 3 కాన్సెప్ట్​ నగరాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.