ETV Bharat / state

ఇళ్ల పట్టాల పేరుతో వాలంటీర్ మోసం.. 4 లక్షల వసూలు?

ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తానంటూ ఓ వాలంటీరు రూ. 4లక్షల వరకు వసూలు చేసిన సంఘటన చిత్తూరులో వెలుగులోకి వచ్చింది. ఈ అంశం తమ దృష్టికి రాలేదని అధికారులు తెలిపారు.

ward volunteer Rs. 4 lakh fraud in chittor
ఇళ్ల పట్టాల పేరుతో వాలంటీర్ మోసం
author img

By

Published : Jan 8, 2021, 9:54 AM IST

ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తానంటూ ఓ వాలంటీరు రూ. 4లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని నాలుగో డివిజన్ పరిధి ఓ వార్డు వాలంటీరు.. సమీపంలో రద్దీ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తానంటూ 37 మంది నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల కాగితాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు వాలంటీరును నిలదీశారు. ఈ వ్యవహారం స్థానిక వైకాపా నేతల దృష్టికి వెళ్లడంతో ఓ ప్రముఖుడు సర్దుబాటుకు ప్రయత్నించినట్లు తెలిసింది.

వసూళ్లకు పాల్పడిన వాలంటీరు వద్ద ఉన్నతాధికారుల పేరుతో ముద్రలు (సీళ్లు) ఉన్నాయని స్థానికులు తెలిపారు. లోగడ కూడా అక్రమాలకు పాల్పడిన ఈ వాలంటీరుకు సహకరించిన నాలుగో డివిజన్ వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శిని ఇటీవలే నగరపాలక అధికారులు బదిలీ చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో వాలంటీర్ నగదు వసూలు చేశాడనే అంశం తమ దృష్టికి రాలేదని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి తెలిపారు.

ఇదీ చదవండి:

ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.