తిరుమల శ్రీవారిని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఈ రోజు ఉదయం సందర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న భానుప్రకాష్.. రాజకీయ నాయకులు ఆలయం వద్ద రాజకీయ విమర్శలు చేయడాన్ని ఖండించారు.
రాజకీయాలు మాట్లాడకూడదనే నిబ్బందనలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రవిత్రమైన తిరుమల ఆలయ ప్రదేశాల్లో విమర్శలు చేసిన వారికి తితిదే నోటీసులు పంపాలని కోరారు. తిరుపతి బస్ డ్రైవింగ్ వంటి గేమ్‌లు భవిష్యత్తులో రాకుండా నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: