దేశ సంస్కృతి, హైందవ సంప్రదాయాలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ప్రభుత్వాధినేతలు ఖండించాల్సిన అవసరం ఉందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలు, సనాతన హిందూ ధర్మానికి భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. గతంలో మతమార్పిడి ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొన్న హిందూ సమాజం.. ప్రస్తుతం ఆలయాలపై జరుగుతున్న దాడులతో మరింత భయాందోళనలకు లోనవుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటన్నింటికీ బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చదవండి: కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇక ఉమ్మడి పరీక్ష!