తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, తెలంగాణ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాను తెదేపాతోనే ఉంటాననీ.. పార్టీ మారుతున్నట్లు వచ్చే వార్తల్ని నమ్మవద్దని గిరిధర్ చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలంగాణ ఎమ్మెల్సీ తెలిపారు.
ఇవీ చదవండి..