తిరుమల శ్రీవారిని మంత్రి అప్పలరాజు దర్శించుకున్నారు. జలవివాదం నెలకొనడం బాధాకరమని.. తిరుమల శ్రీవారి దయతో జలవివాదానికి పరిష్కారం కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన జలాలు గౌరవప్రదంగా పొందాలన్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి ఆయనతో ఉన్నారు.
జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని... అక్రమ విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తే సహించబోమని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే రోజాతో పాటు.. జబర్దస్త్ బృందం సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మహిళల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని తెలిపిన రోజా... జల వివాదం పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాశామన్న రోజా.. ముఖ్యమంత్రి జగన్ తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా