చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల అభివృద్ధి అధికారి రాజశేఖర రెడ్డిని... పీవీపురం గ్రామస్తులు నిర్బంధించారు. పీవీపురంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా... భాస్కరరెడ్డి, టెండూల్కర్ అనే వ్యక్తులు సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో టెండూల్కర్ గెలుపొందారు.
టెండూల్కర్ వర్గానికి ఎంపీడీఓ అనుకూలంగా వ్యవహరించటంతోనే... అతడు సర్పంచిగా గెలిచాడని భాస్కరరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన రాజశేఖర రెడ్డిని అడ్డుకున్న భాస్కరరెడ్డి వర్గీయులు.. కాసేపటికి ఆయనను నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఇరువర్గాలకు సర్దిచెప్పి, ఎంపీడీఓను గ్రామం నుంచి పంపించారు.
ఇదీ చదవండి: