చిత్తూరు జిల్లా సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని...తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనతోనే సాధ్యమని ఉపముఖ్యమంత్రి అన్నారు. అవినీతి లేకుండా చూడటమే ధ్యేయంగా సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతిభావంతులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్నారు.
ఇదీ చూడండి: 'ఆ కారణంగానే వాలంటీర్లకు గౌరవవేతనం చెల్లించలేదు'