చిత్తూరు జిల్లా మదనపల్లెలో నడి రోడ్డుపై ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. పట్టణంలో బెంగుళూరు బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద తనకు దారి ఇవ్వాలని ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రామయ్య కోరగా... ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్ ససేమిరా అనడంతో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. కర్ఫ్యూ సమయం కావటంతో బారికేడ్ తొలగించలేనని వేరే దారిలో వెళ్లాలని కానిస్టేబుల్ సూచించారు. తాను ప్రభుత్వ ఉద్యోగినే కావటంతో వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని రామయ్య కోరారు. దీంతో మాటామాట పెరగడంతో ఇద్దరూ తోపులాటకు దిగారు. ఈ క్రమంలో రామయ్యపై ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్ చెయ్యి చేసుకున్నారు. కర్ఫ్యూను ప్రశాంతంగా అమలు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా నడిరోడ్డుపై ఘర్షణకు దిగటం మదనపల్లెలో చర్చనీయాశంగా మారింది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్ ససేమిరా అనటంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి..
Covid Third Wave: అధునాతన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్