ETV Bharat / state

పాపం చిన్నారులు: రాత్రి పడుకున్నారు.. తెల్లవారే సరికి విగతజీవులయ్యారు! - chittoot latest news

చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. బుధవారం రాత్రి పడుకున్న చిన్నారులు.. మర్నాడు ఉదయానికి విగత జీవులుగా మారారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two chilrens died in sleep at srikalahasti

author img

By

Published : Feb 17, 2022, 7:54 PM IST

ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచ గన్నేరి సమీపంలో జరిగింది. పశ్చిమ బెంగాల్​కు చెందిన రమేష్ కుమార్ స్థానిక పైపుల పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇక్కడే భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.

బుధవారం రాత్రి పడుకున్న హేన(5), రోషన్(1).. గురువారం ఉదయం నిద్ర లేవలేదు. ఎంత పిలిచినా లేవకపోవడంతో.. పరీక్షించి చూడగా విగత జీవులుగా మారారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. విషయం తెలుకుసున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: గోరంట్ల మేజర్‌ కాల్వలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.