ETV Bharat / state

8వ రోజూ తితిదే ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్​లో తితిదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని కలపరాదని డిమాండ్ చేస్తూ తిరుపతిలో చేస్తున్న నిరసన 8వరోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 24, 2020, 6:18 PM IST

vttd outsourcing  employees protest reached to 8th day in tirurpati
ttd outsourcing employees protest reached to 8th day in tirurpati

తితిదే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని తితిదే ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద చేపట్టిన నిర‌స‌న దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. తితిదే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌర‌వాధ్య‌క్షులు ఎం.నాగార్జున మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఏపీసీఓఎస్​లో కలిపేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని, దీనివల్ల కలిగే లాభం ఏంటని ప్రశ్నించారు. కరోనా విపత్తు సమయంలో మూడు నెలలుగా సిబ్బంది పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు.

ఏపీసీఓఎస్​లో విలీనం వల్ల తితిదేకి సెస్ రూపంలో సంవత్సరానికి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టం కలుగుతున్నా.. అధికారులు పట్టించుకోకుండా ఈ నిర్ణయానికి వత్తాసు పలకడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన టైమ్ స్కేలు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.