ఈ నెల 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమలలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశం కోసం ఈ రెండు రోజుల్లోనే లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి రానుండగా... ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. మొత్తం 85 వేల మంది భక్తులు అన్ని వసతులతో ఏకకాలంలో క్యూలైన్లలో వేచి ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరంతరం అన్న పానీయాలు అందించేలా జాగ్రత్తలు సహా.... షెడ్లు, క్యూలైన్ల వద్ద భారీ సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 5వ తేదీ అర్థరాత్రి ఆలయం తలుపులు తెరిచి శ్రీవారికి ధనుర్మాస పూజలు, ఇతర కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం వైకుంఠ ద్వారం తెరిచి... మొదటగా ఏకాదశి పాసులు పొందిన వారిని అనుమతిస్తారు. ఉదయం 4 గంటల నుంచి సర్వదర్శనం ద్వారా సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఏకాదశి రోజు ఉదయం స్వామి వారికి స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి :